అమ్మమ్మకు నో కట్స్‌ | Ammamma Gari Illu has completed its censor formalities | Sakshi
Sakshi News home page

అమ్మమ్మకు నో కట్స్‌

May 22 2018 1:56 AM | Updated on May 22 2018 1:56 AM

Ammamma Gari Illu has completed its censor formalities - Sakshi

నాగశౌర్య, బేబి షామిలి

నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్‌ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’.  స్వప్న సమర్పణలో స్వాజిత్‌ మూవీస్‌ బ్యానర్‌లో రాజేష్‌ నిర్మించారు. కె.ఆర్‌ సహ నిర్మాత. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ సింగిల్‌ కట్‌ లేకుండా క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ సందర్భంగా రాజేష్, కె.ఆర్‌. మాట్లాడుతూ –‘‘చక్కని కుటుంబ కథా చిత్రమిది.  ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ప్రేక్షకులందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కుటుంబ కథా చిత్రం కావడం,  స్వచ్ఛమైన తెలుగు టైటిల్‌ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. పలువురు సినీ పెద్దలు టీజర్‌ బాగుందని చెప్పడం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సెన్సార్‌ వారు మా సినిమాని మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సుందర్‌ సూర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement