ఆ క్లైమాక్స్ చాలా కాలం హాంట్ చేసింది! | Sakshi
Sakshi News home page

ఆ క్లైమాక్స్ చాలా కాలం హాంట్ చేసింది!

Published Sat, Jan 2 2016 11:21 PM

ఆ  క్లైమాక్స్ చాలా కాలం హాంట్ చేసింది! - Sakshi

 ‘‘సాధారణంగా కొన్ని సినిమాలు  థియేటర్‌లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత నిర్మిస్తున్న ‘స్పీడున్నోడు’ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సంద ర్భంగా పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు...

 తమిళ ‘సుందరపాండ్యన్’ సినిమా క్లైమాక్స్ నన్ను చాలాకాలం హాంట్ చేసింది. అందులో ఎమోషన్స్‌కి కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా ఒప్పుకున్నా. ఆ సినిమా మెయిన్ థీమ్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ‘స్పీడున్నోడు’ చేస్తున్నాం.
 
 హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఓ కుర్రాడు తనకు ఎదురైన సమస్యను ఎలా డీల్ చేశాడ నేది కథ. అన్ని వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది.  ‘అల్లుడు శీను’ సినిమా కంటే డ్యాన్సులు, ఫైట్ల విషయంలో దీనికి పది రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. ఇందులో నేను విలేజ్‌కు చెందిన కుర్రాణ్ణి కాబట్టి  బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. రెండు పాటలు మినహా ‘స్పీడున్నోడు’ పూర్తయింది.  ఈ నెల 16న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం.
 
 అసలు నా రెండో సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుగారితో చేయాల్సి ఉంది. అయితే అంతకంటే  ముందే బన్నీతో బోయపాటి గారు ఓ సినిమా చేద్దామనుకున్నారు. కానీ బన్నీ  డేట్స్ దొరక్కపోవడంతో  నాతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కథ సరిగ్గా సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఈ ఏప్రిల్ 8 నుంచి బోయపాటి శ్రీనుగారి సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్  విజయకుమార్ కొండా  దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది.
 

Advertisement
 
Advertisement