సైన్స్‌... రొమాన్స్‌! | allu sirish-vi anand film launched | Sakshi
Sakshi News home page

సైన్స్‌... రొమాన్స్‌!

Apr 10 2017 12:09 AM | Updated on Sep 5 2017 8:22 AM

సైన్స్‌... రొమాన్స్‌!

సైన్స్‌... రొమాన్స్‌!

ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్‌ చెబుతోంది.

ఆత్మలు ఉన్నాయా... లేవా! మనిషి బరువు ఎంతున్నా మరణానంతరం 21 గ్రాముల తగ్గుతుందని సైన్స్‌ చెబుతోంది. ఈ అంశాలతో దర్శకుడు వీఐ ఆనంద్‌ తీసిన సైంటిఫిక్, రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మంచి హిట్టయ్యింది. మళ్లీ అలాంటి ఓ వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వీఐ ఆనంద్‌.

అల్లు శిరీష్‌ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించనున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్రనిర్మాత చక్రి తండ్రి శంకర్‌ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘సైంటిఫిక్‌ అండ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు అల్లు శిరీష్‌. చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని వీఐ ఆనంద్‌ తెలిపారు. సురభి, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: సతీశ్‌ వేగేశ్న, రాజేశ్‌ దండ.

Advertisement
 
Advertisement
Advertisement