మగధీరతో కనెక్షన్‌ ఉందా? | Allu Aravind approaches Court to stop Raabta | Sakshi
Sakshi News home page

మగధీరతో కనెక్షన్‌ ఉందా?

May 25 2017 12:03 AM | Updated on Sep 5 2017 11:54 AM

మగధీరతో కనెక్షన్‌ ఉందా?

మగధీరతో కనెక్షన్‌ ఉందా?

హిందీలో ‘రాబ్తా’ అనే పదానికి మీనింగ్‌ ఏంటో తెలుసా? ‘కనెక్షన్‌’ అని! సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ (‘వన్‌ నేనొక్కడినే’ ఫేమ్‌) జంటగా నటించిన హిందీ ఫిల్మ్‌

హిందీలో ‘రాబ్తా’ అనే పదానికి మీనింగ్‌ ఏంటో తెలుసా? ‘కనెక్షన్‌’ అని! సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కృతి సనన్‌ (‘వన్‌ నేనొక్కడినే’ ఫేమ్‌) జంటగా నటించిన హిందీ ఫిల్మ్‌ ‘రాబ్తా’ ట్రైలర్‌ రిలీజవ్వగానే ‘‘తెలుగు హిట్‌ ‘మగధీర’కు, దీనికి ఏదో కనెక్షన్‌ ఉన్నట్టుంది!’’ అని సోషల్‌ మీడియాలో కొందరు సెటైర్స్‌ వేశారు. ‘రాబ్తా’ ట్రైలర్‌లో, స్టిల్స్‌లో ‘మగధీర’ ఛాయలు కనిపిస్తున్నాయంటున్నారు.

 ‘‘కనెక్షన్‌ కాదు, మా చిత్రకథను కాపీ కొట్టారు’’ అంటూ ‘మగధీర’ చిత్రనిర్మాత అల్లు అరవింద్‌ బుధవారం హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు మెట్లెక్కారు. ‘రాబ్తా’ విడుదలను నిలిపివేయాలని కోరారు. కేసును కోర్టు జూన్‌ 1కి వాయిదా వేసింది. జూన్‌ 9న ‘రాబ్తా’ విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో  1న ఏం తీర్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement