ఆ టైటిల్‌ పెట్టినప్పుడు తిట్టారు

Allari Naresh Speech at Jamba Lakidi Pamba Pre- Release Event - Sakshi

అల్లరి నరేశ్‌

‘‘మేడమీద అబ్బాయి’ సినిమా నుంచి మనూగారితో మంచి పరిచయం ఉంది. ‘జంబ లకిడి పంబ’ టైటిల్‌ పెట్టడంతో అందరూ తిట్టారని మను అన్నారు. గతంలో నా సినిమాకి ‘అహ నా పెళ్ళంట’ టైటిల్‌ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని తిట్టారు. అయితే మేం హిట్‌ కొట్టాం. నాన్నగారి (ఈవీవీ) ‘జంబ లకిడి పంబ’ సినిమా ఎంత విజయం సాధించిందో ఈ సినిమా అంతే పెద్ద సక్సెస్‌ కావాలి’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి. మురళీ కృష్ణ (మను) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జంబ లకిడి పంబ’.

రవి, జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. బీజేపీ ఎం.ఎల్‌.సి మాధవ్‌ ట్రైలర్‌ లాంచ్‌ చేయగా, బ్యానర్‌ లోగోను బీరం సుధాకర్‌ రెడ్డి విడుదల చేశారు. జె.బి.మురళీకృష్ణ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’ సినిమా పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు మాత్రం తీయం’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ఇది. ఈ నెల 22న సినిమాను  విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత రవి. ‘‘మా సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్‌ చేయాలి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. సిద్ధి ఇద్నాని, నిర్మాతలు జో జో జోస్, శ్రీనివాస రెడ్డి.ఎన్, సంగీత దర్శకుడు గోపీసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top