సూపర్ స్టార్ సినిమా కోసం న్యూ లుక్

Allari Naresh Special Role in Mahesh Babu 25 Film - Sakshi

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ సినిమా తరువాత వంశీ పైడీపల్లి దర్శకత్వంలో మరో తన 25వ సినిమా చేయనున్నాడు మహేష్. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో యువ కథానాయకుడు అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ న్యూ లుక్ లో దర్శనమివ్వనున్నాడట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న నరేష్ కాస్త బొద్దుగా కనిపించాడు. దీంతో ఈ లుక్ మహేష్ సినిమా కోసమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మేడ మీద అబ్బాయి సినిమాతో మరోసారి నిరాశపరిచిన నరేష్, కెరీర్ ను మలుపు తిప్పే ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top