ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం | Akshay Kumar Takes New Challenge to Make Quick Money | Sakshi
Sakshi News home page

ఫన్నీ చాలెంజ్‌లో అక్షయ్‌.. ఫైరవుతోన్న ట్వింకిల్‌ ఖన్నా

Jul 17 2019 11:54 AM | Updated on Jul 17 2019 12:01 PM

Akshay Kumar Takes New  Challenge to Make Quick Money - Sakshi

బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌ కుమార్‌ ఫిట్‌నెస్‌ ప్రీక్‌ అన్న సంగతి తెలిసిందే. వయసు పైబడుతున్న కొద్ది మరింత సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు అక్షయ్‌. సెలవు రోజుల్లో కూడా వ్యాయామాన్ని పక్కన పెట్టరు అక్షయ్‌. ఇంత ఫిట్‌గా ఉంటారు కాబట్టే నేటికి కూడా తన సినిమాల్లో యాక్షన్‌ సీన్లను డూప్‌ లేకుండా తానే చేస్తుంటారు అక్షయ్‌. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారు అక్షయ్‌.

ఈ సందర్భంగా అక్షయ్‌ పాల్గొన్న ఓ చాలెంజ్‌ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు ట్వింకిల్‌ ఖాన్న. ఈ టూర్‌లో అక్షయ్‌ తన కండ బలాన్ని పరీక్షించుకోవడమే కాక.. త్వరగా డబ్బు సంపాదించడం కోసం ఓ చాలెంజ్‌లో పాల్గొన్నారు అంటున్నారు ట్వింకిల్‌ ఖన్నా.  ఫోటోతో పాటు.. ‘ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించినా సంతృప్తి లేదు. త్వరగా డబ్బు సంపాదించే ఏ అవకాశాన్ని విడిచిపెట్టడు. 100 పౌండ్లు ఇస్తామనే సరికి ఇలాంటి స్టంట్లు చేస్తున్నాడు’ అంటూ కామెంట్‌ చేశారు ట్వింకిల్‌ ఖన్నా.
 

ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్రతి ఏడాది విడుదల చేసే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల జాబితాలో అక్షయ్‌ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. మ‌న దేశం నుండి అక్షయ్‌కు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఈ లిస్టులో అక్షయ్‌కు 33వ స్థానం ద‌క్కింది. ఒక సినిమా కోసం అక్షయ్‌ రూ.35-70 కోట్ల వ‌రకు తీసుకుంటాడని ఫోర్బ్స్‌ వెల్లడించింది. కేవ‌లం సినిమాల ప‌రంగానే కాకుండా.. బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ అక్షయ్‌ భారీ మొత్తం అర్జిస్తున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. 2018 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వ‌ర‌కు అక్షయ్‌ కుమార్ రూ.444 కోట్ల సంపాద‌న‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్స్ రిహానా, జాకీచాన్‌, బ్రాడ్లీ కూప‌ర్ వంటి వారిని అధిగ‌మించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్‌ నటించిన `మిష‌న్ మంగ‌ళ్` విడుదలకు సిద్ధమవుతుండ‌గా.. `హౌస్‌ఫుల్ 4`, `గుడ్‌న్యూస్`, `లక్ష్మీబాంబ్`‌, `సూర్య‌వంశీ` చిత్రాలు  షూటింగ్‌ జ‌రుపుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement