అక్కీ సో లక్కీ.. | Akshay Kumar Ranks Forbes Highest Paid Actors | Sakshi
Sakshi News home page

అక్షయ్‌ అరుదైన ఘనత

Aug 22 2019 3:28 PM | Updated on Aug 22 2019 5:19 PM

Akshay Kumar Ranks Forbes Highest Paid Actors - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని మరోసారి సత్తా చాటారు. మిషన్‌ మంగళ్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న అక్షయ్‌ తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు.

ముంబై : బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకునే స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నాలుగవ నటుడిగా ఫోర్భ్స్‌ జాబితాలో నిలిచారు. తొలి మూడు స్ధానాల్లో హాలీవుడ్‌ స్టార్లు ద్వాన్‌ జాన్సన్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌లు నిలిచారు. అక్షయ్‌ కుమార్‌ 2018 జూన్‌ 1 నుంచి 2019 జూన్‌ 1 నాటికి ఏకంగా రూ 466 కోట్లు ఆర్జించారని ఫోర్బ్స్‌ మేగజైన్‌ వెల్లడించింది. ఈ ఏడాది అక్షయ్‌ నటించిన రెండు సినిమాలు కేసరి, మిషన్‌ మంగళ్‌ ఇప్పటికే విడుదలవగా, మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌ న్యూస్‌, రాఘవ లారెన్స్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్‌, సూర్యవంశి, బచన్‌ పాండే వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రకటనలపైనా అక్షయ్‌ భారీగా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు విభాగాలకు చెందిన 20 ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో తాను అత్యధిక ఆదాయం ఆర్జించే నటుల సరసన చేరడం గురించి ఓ ఇంటర్వ్యూలో​ప్రస్తావిస్తూ తాను సంపాదించే ప్రతి రూపాయి వెనుక కఠోరశ్రమ దాగిఉందని అక్షయ్‌ చెప్పుకొచ్చారు. డబ్బు సంపాదించడం తనకు ప్రధానమేనని, దాని కోసం తాను ఎంతో చెమటోడ్చుతానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement