ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా | Akshay Kumar Opens About Being One of World's Highest Paid Celebrities | Sakshi
Sakshi News home page

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

Aug 7 2019 6:11 PM | Updated on Aug 7 2019 7:28 PM

Akshay Kumar Opens About Being One of World's Highest Paid Celebrities - Sakshi

ముంబై : సినిమా రంగంలో ప్రస్థానం ప్రారంభించి మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పాత్రల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తుంటాడు బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్. మొదట యాక్షన్‌ సినిమాలకే పరిమితమైన అక్షయ్‌ అనంతరం విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘అత్యధిక పారితోషికం అందుకుంటున్నసెలబ్రెటీల జాబితా 2019’లో భారత్‌ నుంచి స్ధానం సంపాదించిన ఏకైక వ్యక్తిగా అక్షయ్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో అక్షయ్‌ జూన్‌ 2018 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకూ మొత్తం రూ 444 కోట్ల సంపాదనతో  ప్రపంచవ్యాప్తంగా 33వ స్థానంలో నిలిచారు. 

ఈ క్రమంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు బాలీవుడ్‌ ఖిలాడీ. ‘ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించినందుకు సంతోషంగా ఉంది. నా కష్టం వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా. డబ్బు నాకు ముఖ్యమే కానీ  కొన్ని విషయాల్లోనే’  అని స్పష్టం చేశారు.  అక్షయ్‌ నటించిన కొత్త చిత‍్రం ‘మిషన్‌ మంగళ్‌’ ఆగష్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement