వయసు 44.. మనసు 28...! | Age 44 ..   About 28 ...! | Sakshi
Sakshi News home page

వయసు 44.. మనసు 28...!

Mar 14 2014 11:51 PM | Updated on Mar 28 2019 6:31 PM

వయసు 44..  మనసు 28...! - Sakshi

వయసు 44.. మనసు 28...!

కొంతమంది 20లలోనే 60 ఏళ్ల వయసులో ఉన్నట్లుగా ఫీలైపోతుంటారు. అందుకు పూర్తి భిన్నంగా కొందరు 60లలోనూ 20లలో ఉన్నట్లుగా భావిస్తారు.

 కొంతమంది 20లలోనే 60 ఏళ్ల వయసులో ఉన్నట్లుగా ఫీలైపోతుంటారు. అందుకు పూర్తి భిన్నంగా కొందరు 60లలోనూ 20లలో ఉన్నట్లుగా భావిస్తారు.

ఏ ఫీలింగైనా శరీర తత్వం, మనస్తత్వాన్ని బట్టే ఉంటాయి. ఇక, హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్ గురించి చెప్పాలంటే... ఆమె వయసు 44. కానీ, మనసు వయసు మాత్రం 28 అంటారామె. ప్రస్తుతం జెన్నీ ఓ ధారావాహికలో నటిస్తున్నారు. అలాగే ఓ ఆల్బమ్ రూపొందిస్తున్నారు. ఓ వస్త్ర దుకాణానికి అధినేత కూడా.

ఆరేళ్ల కవలలకు తల్లి. ఇన్ని బాధ్యతలను సునాయాసంగా మోసేస్తున్నారు జెన్నిఫర్. కుర్ర తారలు సైతం పోటీపడలేనంత ఎనర్జీ ఆమె సొంతం. ఎందుకంటే, తన వంటి మీదకు వయసు పెరుగుతున్నట్లు ఎప్పుడూ ఫీలవలేదట జెన్నిఫర్. ఏళ్లు గడిచే కొద్దీ వయసు పెరగడం సహజం అని, దాంతోపాటే తన ఎనర్జీ కూడా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement