ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో... | Adith Arun Speech at Amala Paul New Movie Opening Event | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

Aug 12 2019 1:39 AM | Updated on Aug 12 2019 1:39 AM

Adith Arun Speech at Amala Paul New Movie Opening Event - Sakshi

రామ్మోహన్‌రావు, అరుణ్‌ ఆదిత్, అమలా పాల్‌

అమలా పాల్‌ హీరోయిన్‌గా, అరుణ్‌ ఆదిత్‌ హీరోగా అనూప్‌ పనికర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కాస్మోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జె. ఫణీ ంద్ర కుమార్, ప్రభు వెంకటాచలం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘రాక్షసుడు’ సినిమా డైరెక్టర్‌ రమేష్‌ వర్మ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తెలంగాణ  రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి. రామ్మోహన్‌ రావు క్లాప్‌ ఇచ్చారు.   తమ్మారెడి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఫోరెన్సిక్‌ థ్రిల్లర్‌ అనే కొత్త జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది.

ఫోరెన్సిక్‌ పరీక్షలు అంటే ఏంటో ఈ సినిమాలో చూపించనున్నారు’’ అన్నారు. అమలాపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నా. తమిళంలో అజయ్‌ పనికర్‌తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో ‘కడావర్‌’ అనే టైటిల్‌ పెట్టాం’’ అన్నారు. ‘‘నా గత సినిమా విడుదలైన తర్వాత ‘ఇమ్రాన్‌ హష్మి అవుదామనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు.. అలాంటిదేమీ లేదు’’ అన్నారు అరుణ్‌ ఆదిత్‌. ‘‘చెన్నైలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అభిలాష్‌ ఈ కథ రాశారు’’ అన్నారు అనూప్‌ పనికర్‌. నటుడు వినోద్‌ సాగర్, కెమెరామేన్‌ అరవింద్‌ సింగ్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోనీ.

Advertisement
 
Advertisement
Advertisement