హాలిడే కానీ వర్క్‌ డే! | Ada Sharma start her journey with web series Holiday | Sakshi
Sakshi News home page

హాలిడే కానీ వర్క్‌ డే!

Jun 23 2019 5:46 AM | Updated on Jun 23 2019 5:46 AM

Ada Sharma start her journey with web series Holiday - Sakshi

వెబ్‌ సిరీస్‌ కోసం కలర్డ్‌ హెయిర్‌తో...

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకున్న అదా శర్మ ఇప్పుడు డిజిటల్‌ రంగంవైపు కూడా దృష్టి పెట్టారు. ‘హాలిడే’ అనే వెబ్‌ సిరీస్‌ చేయడానికి ఆమె అంగీకరించారు. ‘‘హాలిడే వెబ్‌ సిరీస్‌ కోసం మారిషస్‌ వచ్చాం. కొత్త హెయిర్‌ కలర్‌ డిజైన్‌ ట్రై చేశాను. ఏ హీరోయిన్‌ అయినా నా హెయిర్‌స్టైల్‌తో ఇన్‌స్పైర్‌ అయినట్లయితే.. వారు నాకు కాపీరైట్‌ చార్జెస్‌ పే చేయాలి (సరదాగా)’’ అని పేర్కొన్నారు అదా శర్మ. మారిషస్‌లో కొన్ని రోజుల పాటు ఈ చిత్రీకరణ జరుగుతుంది. అదా వెబ్‌సిరీస్‌లో నటించడం ఇదే తొలిసారి. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో రాజశేఖర్‌ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాలో అదా శర్మ ఒక హీరోయిన్‌గా నటించారు. అటు హిందీలో ‘బైపాస్‌ రోడ్, కమాండో 3’ సినిమాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement