పోలీసులకు హీరో భార్య ఫిర్యాదు | Aamir Khan’s wife Kiran Rao registers police complaint against Facebook impersonator | Sakshi
Sakshi News home page

పోలీసులకు హీరో భార్య ఫిర్యాదు

Jun 5 2016 4:50 PM | Updated on Jul 26 2018 12:31 PM

పోలీసులకు హీరో భార్య ఫిర్యాదు - Sakshi

పోలీసులకు హీరో భార్య ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచారని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు పోలీసులను ఆశ్రయించారు.

ముంబై: తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచారని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ భార్య, దర్శకురాలు కిరణ్ రావు పోలీసులను ఆశ్రయించారు. నకిలీ ఎకౌంట్ తో సోషల్ మీడియాలో తన పరువు తీస్తున్నారని బాంద్రా కుర్లాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫేస్బుక్ లో తన ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడని.. అక్కడితో ఆగకుండా తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేస్తున్నాడని కిరణ్ రావు ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగతా వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సెలబ్రిటీల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖతాలు తెరిచి అనుచితంగా ప్రవర్తించడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా సినీతారల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు పెరిగిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement