పాత్ర కోసం కుట్లు | Aamir Khan get his nose and ears pierced for Thugs of Hindostan, actually spill blood for movie | Sakshi
Sakshi News home page

పాత్ర కోసం కుట్లు

Published Wed, Nov 7 2018 12:44 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Aamir Khan get his nose and ears pierced for Thugs of Hindostan, actually spill blood for movie - Sakshi

పాత్ర పరిపూర్ణత కోసం ఎంత దూరమైనా వెళ్తారు బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌. అందుకే ఆయన్ను ‘మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌’ అంటుంటారు. ‘గజిని’ పాత్రకోసం గుండు చేయించుకోవడం, ‘దంగల్‌’ కోçసం బరువు పెరిగి, తగ్గిన సంగతి గుర్తుండే ఉంటుంది.  ఆమిర్‌ తాజా చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’. ఈ సినిమాలో ఆయన ఫిరంగి అనే పాత్ర పోషించారు.

పలు షేడ్స్‌ ఉన్న పాత్ర ఇది. ఈ క్యారెక్టర్‌ కోసం ఆమిర్‌ఖాన్‌ నిజంగానే ముక్కు కుట్టించుకున్నారు. ‘‘ఈ పాత్ర అనుకుంటున్నప్పటి నుంచి ఈ పాత్రకు ముక్కు పుడక, చెవి పోగు ఉండాలి అనుకున్నాను. ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్‌లోనే ఉండాలనుకుంటాను. అప్పుడే ఆ పాత్రను సరిగ్గా చేయగలుగుతాను’’ అని పేర్కొన్నారు ఆమిర్‌.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement