
మళ్లీ బాండ్‌గా..!
జేమ్స్ బాండ్... ఈ కారెక్టర్ అంటే పిల్లలకూ, పెద్దలకూ చాలా ఇష్టం. ఇప్పటి వరకు హాలీవుడ్‌లో 23 బాండ్ చిత్రాలొచ్చాయి.
జేమ్స్ బాండ్... ఈ కారెక్టర్ అంటే పిల్లలకూ, పెద్దలకూ చాలా ఇష్టం. ఇప్పటి వరకు హాలీవుడ్‌లో 23 బాండ్ చిత్రాలొచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం ఆకట్టుకున్నవే. ఇప్పుడు 24వ బాండ్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్‌గా డేనియెల్ క్రెగ్ నటించనున్నారు. జేమ్స్ బాండ్ ప్రధాన పాత్రగా రూపొందిన ‘క్యాసినో రాయల్’లో మొదటిసారి బాండ్‌గా తెరపై కనిపించారు డేనియెల్. ఆ తర్వాత ‘క్వాంటమ్ ఆఫ్ సోలాస్’, ‘స్కైఫాల్’ చిత్రాల్లోనూ ఆ పాత్రను సమర్థంగా పోషించారు.
ఇప్పుడు మరోసారి బాండ్‌గా నటించే అవకాశం ఆయనకే దక్కింది. సామ్ మెండ్స్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన భారీ పోరాట దృశ్యాలను రోమ్‌లో తీయాలనుకుంటున్నారట. కారు ఛేజ్‌లు, ఫ్లయిట్ క్రాష్‌లూ, పారాచ్యూట్‌తో ఎగరడాలు... ఇలా ప్రతి పోరాట దృశ్యంలోనూ బాండ్ చేసే విన్యాసాలు అలరించేట్లుగా, గత బాండ్ చిత్రాలను తలపించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.