ఆ రోజు ఆమెకు నేను ధైర్యంగా చెప్పినందుకే.. | Manche Maheshwar Happy Ending Love Story From Yadagirigutta | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఆమెకు నేను ధైర్యంగా చెప్పినందుకే..

Oct 20 2019 10:13 AM | Updated on Oct 30 2019 5:05 PM

Manche Maheshwar Happy Ending Love Story From Yadagirigutta - Sakshi

ఆ రోజు ఆమెకు నేను ధైర్యంగా చెప్పినందుకే...

నా పేరు మహేశ్వర్‌ నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట(నేటి యాదాద్రి జిల్లా). యాదగిరిగుట్టలో సంక్రాతి ధనుర్మాసపు సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగేవి. ఆ సమయాల్లో మేము ప్రతి రోజూ మబ్బుల ఆరగింపుకు వెళ్లే వాళ్లం. కనీసంగా 15 రోజులు పూజలకు వెళ్తాం. ఒక రోజు నాతో స్నేహంగా ఉంటున్న ఆమెతో (09 .1 .1993)న ‘‘నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని ధైర్యంగా చెప్పాను. ఆమె మౌనంగా వెళ్లిపోయింది. మరునాడు దేవాలయానికి పూజకు వచ్చినప్పుడు ఆమె నాతో మాట్లాడింది. అప్పుడు నేనంటే ఆమెకు ఇష్టమని గ్రహించి స్నేహాన్ని కొనసాగించాను.

అనంతరం మా కుటుంబాలకు తెలియకుండానే మేమిద్దరం 13.6.1994న ప్రేమ వివాహం చేసుకున్నాం. మేం ఇప్పటికీ ప్రేమికులమే. ఆ రోజు ఆమెకు నేను ధైర్యంగా చెప్పినందుకే తను నాతో జీవితాంతం కలిసి నడుస్తున్నది. ఆమె నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక వేళ తిరస్కరించి ఉంటే మౌనంగా ఉండి పోయేవాన్ని. ఆ దేవుడు నా ప్రేమను విజయవంతం చేసినందుకు ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు యాదగిరిగుట్టకు వెళ్తాను. కృతఙ్ఞతలు తెలుపుకుంటాను. 
- మంచే మహేశ్వర్, యాదగిరిగుట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement