అతని కోసమే చేశా..!

Praveen Reddy Withdraw His Nomination Of MLC Elections - Sakshi

నామినేషన్‌ ఉపసంహరించుకున్న కళ్లెం ప్రవీణ్‌రెడ్డి

సాక్షి, కరీంనగర్‌ అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి తన మద్దతు ఇచ్చేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు కల్లెం ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని ప్రెస్‌భవన్‌లో గు రువారం విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ వేసి, ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలోని ప్రజాసమస్యలు, రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై జీవన్‌రెడ్డికి పూర్తిగా అవగాహన ఉందన్నారు. ప్రజాసమస్యలను మండలిలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు.

రైతులకు సాగునీరు, వనరులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన జీవన్‌రెడ్డిని పట్టభద్రు ల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, రిటైర్డు డీఈవో అక్రముల్లాఖాన్, టీపీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆకుల ప్రకాశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి గుగ్గిళ్ల జయశ్రీ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి చాడగొండ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు ఉమాపతి, సరిళ్ల ప్రసాద్, దేవ శిల్పవేదం పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top