'యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ప్రాధ్యానత'


న్యూజెర్సీ: వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ విభాగం శుక్రవారం న్యూజెర్సీలోని ఎడిసిన్ నగరంలో మీట్ అండ్ గ్రీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 'గడపగడపకూ వైఎస్ఆర్సీపీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అవినీతిపాలన, రెండేళ్ల పాలనలో టీడీపీ వైఫల్యాలను ఆయన వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందడుగు వేయాలంటూ యువతకు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు.





ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ పాల త్రివిక్రమ్ భానోజిరెడ్డి మాట్లాడుతూ.. యువ నాయకత్వానికే వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, యువనాయకత్వం వల్లే పార్టీ పునాదికి బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షపై ఆయన ప్రశంసించారు. అమెరికాలో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం సేవలను త్రివిక్రమ్ భానోజిరెడ్డి కొనియాడారు.



వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచి అవినీతిపై చూపించిన శ్రద్ధ ప్రజలకు మేలు చేయడంలో చూపించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వందకుపైగా పాల్గొన్న వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  కాగా, ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కమిటీ కోర్ టీమ్ మెంబర్ త్రివిక్రమ్ భానోజిరెడ్డి పాలా, వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు సాత్విక్ రెడ్డి,  వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి,  నుతక్కి నాని తదితరులు పాల్గొన్నారు.




 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top