యువత స్మార్ట్ ఫోన్ల మత్తులో కొట్టుకుపోతోంది.
టొరంటో: యువత స్మార్ట్ ఫోన్ల మత్తులో కొట్టుకుపోతోంది. రోజువారి జీవితంలో వారు స్మార్ట్ ఫోన్తో గడిపే సమయం ప్రతియేటా పెరుగుతోందని గ్లోబల్ వెబ్ ఇండెక్స్(జీడబ్యూఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. యువత రోజుకు 3 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లతోనే గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్కులు 2012లో స్మార్ట్ ఫోన్లతో గడిపే సమయం 1.45 గంటలుగా ఉంటే.. ఇది 2014 నాటికి 2.45 గంటలకు పెరిగింది. ఇటీవల ఇది మరింతగా పెరుగుతూ.. ఒకరోజులో యువత మూడు గంటలకు పైగా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే స్మార్ట్ ఫోన్లు కాకుండా ఇతర తెరలపై వెబ్ సేవలను వినియోగించుకునే సమయం మాత్రం తగ్గిపోతుంది.