22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది | Vision came after the 22-year-old | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది

May 9 2016 2:52 AM | Updated on Aug 30 2018 4:07 PM

22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది - Sakshi

22 ఏళ్ల తర్వాత చూపొచ్చింది

20 ఏళ్లుగా చూపులేకుండా అంధకారంలో మగ్గిన 70 ఏళ్ల మహిళ తన గదిలో జారి పడి, తలకు దెబ్బ తగిలి తిరిగి చూపు పొందింది.

హూస్టన్: 20 ఏళ్లుగా చూపులేకుండా అంధకారంలో మగ్గిన 70 ఏళ్ల మహిళ తన గదిలో జారి పడి, తలకు దెబ్బ తగిలి తిరిగి చూపు పొందింది. ఫ్లోరిడాకు చెందిన మేరీ ఆన్ ఫ్రాంకో 1993లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెన్నముకకు గాయమై క్రమంగా చూపు కోల్పోయింది. 22 ఏళ్ల తర్వాత..  గత ఆగస్టులో ఆన్ తన గదిలో తలుపు ైవె పు వెళ్తుండగా కాలు జారి కిందపడింది.

తల.. నేలకు బలంగా తాకింది. అప్పటి నుంచి కొన్ని వారాల క్రితం ఆపరేషన్ జరిగే దాకా అచేతనంగా ఉంది. మెడకు శస్త్ర చికి త్స చేశారు. మత్తు నుంచి కోలుకున్న తరువాత తనకు చూపు తిరిగొచ్చిందన్న సంగతిని గుర్తించింది. ‘‘ ఆన్ విషయంలో జరిగింది అద్భుతం. దీన్ని  శాస్త్రీయంగా వివరించలేక పోతున్నాం’ అని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ జాన్ అఫ్సర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement