ఇరాక్ కు సహాయంగా అమెరికా దళాలు.. | US to send 560 more troops to Iraq to help Iraqi military forces capture Mosul | Sakshi
Sakshi News home page

ఇరాక్ కు సహాయంగా అమెరికా దళాలు..

Jul 12 2016 10:44 AM | Updated on Oct 2 2018 8:44 PM

ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు.

అమెరికాః ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడంలో ఇరాక్ కు సహకరించేందుకు అమెరికా మరింత ముందుకొచ్చింది. ఇరాక్ లో ఉగ్రవాదుల అధీనంలోకి వెళ్ళిన మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాక్ దళాలకు సహాయం అందించేందుకు మరో అడుగు వేసింది. ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ ని విడిపించేందుకు, ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాకీ దళాలకు సహాయంగా 560 అమెరికా దళాలను పంపింస్తున్నట్లు అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్ వెల్లడించారు.  

మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పోరాడేందకు అమెరికా తనవంతు కృషి చేస్తోంది. ఇరాక్ లో ఐసిస్ నిర్బంధంలో ఉన్న మసూల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ దళాలకు మద్దతుగా దాదాపు 560 అమెరికా  సైనిక దళాలను పంపిస్తున్నట్లు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అమెరికా ముందుంటుందని, ఇరాకీ సైనిక దళాలకు అమెరికా సైన్యం తగినంత సహకారం అందిస్తుందని అమెరికా ఢిఫెన్స్ సెక్రెటరీ ఆస్టన్ కార్టర్.. తన అప్రకటిత బాగ్దాద్ పర్యటనలో భాగంగా తెలిపారు.

కార్టర్ తన పర్యటనలో అమెరికా కమాండర్లు, ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబాదీ,  రక్షణ మంత్రి ఖలీద్ అల్ ఒబైదీ లను కలుసుకున్నారు. మరోవైపు కొత్తగా పంపిస్తున్న వారిలో ఇంజనీర్లు, లాజిస్టిక్స్ మరియు ఇతర సిబ్బంది కూడ ఉన్నట్లు కార్టర్ తెలిపారు. వారంతా మాసూల్ కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న కయారా  ఎయిర్ బేస్ అభివృద్ధికి సైతం సహాయం అందిస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement