రష్యాతో లింక్‌: ట్రంప్‌ మేనల్లుడి విచారణ | US Senate panel to question Donald Trump's son-in-law on Russians: Official | Sakshi
Sakshi News home page

రష్యాతో లింక్‌: ట్రంప్‌ మేనల్లుడి విచారణ

Mar 27 2017 8:55 PM | Updated on Apr 4 2019 5:12 PM

రష్యాతో లింక్‌: ట్రంప్‌ మేనల్లుడి విచారణ - Sakshi

రష్యాతో లింక్‌: ట్రంప్‌ మేనల్లుడి విచారణ

రష్యాతో సంబంధాలు కలిగివుండటంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మేనల్లుడు జారెద్‌ కుష్నెర్‌ని విచారించేందుకు సెనేట్‌ సిద్ధమౌతోంది.

వాషింగ్టన్‌: రష్యాతో సంబంధాలు కలిగి ఉండటంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మేనల్లుడు జారెద్‌ కుష్నెర్‌ని విచారించేందుకు యూఎస్‌ సెనేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్యానెల్‌ సిద్ధమవుతోంది. ఈ మేరకు కాంగ్రెస్సెనల్‌ అధికారి ఒకరు సమాచారం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కుష్నెర్‌ ట్రంప్‌కు సలహాదారుగా ఉన్నారు. ప్రస్తుతం వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు అడ్వైజర్‌గా ఉంటున్నారు.
 
కాగా, అమెరికా ఎన్నికల్లో రష్యా హస్తం ఉందని యూఎస్‌ ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన సమాచారంతో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ విచారణకు పిలిచినవారిలో కుష్నెర్‌ ఒక్కరే ట్రంప్‌కు అతి దగ్గరైన వారు. గత ఏడాది డిసెంబర్‌లో ట్రంప్‌ టవర్‌లో రష్యా అంబాసిడర్‌ సెర్జీ కిస్లేయక్‌తో, రష్యా ప్రభుత్వ బ్యాంకుతో జరిగిన సమావేశాల్లో జరిగిన సంభాషణలపై కుష్నెర్‌ను ప్రశ్నించాలని సెనేట్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం యోచిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement