మూర్ఛ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు! | university of ottawa scientists new instrument | Sakshi
Sakshi News home page

మూర్ఛ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు!

Jul 6 2016 7:04 PM | Updated on Sep 4 2017 4:16 AM

మూర్ఛ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు!

మూర్ఛ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు!

మూర్ఛ వ్యాధిని ముందుగానే పసిగట్టే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందిచారు.

టొరంటో: మూర్ఛ వ్యాధిని ముందుగానే పసిగట్టే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందిచారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఉండడం విశేషం. వ్యాధి రావడానికి కారణమైన కొన్ని అంశాలను ముందుగానే గుర్తించడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. కెనడాలోని ఒట్టావా ఆస్పత్రి, యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని రూపొందిచారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా కొందరిలో మూర్ఛ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

తాము తయారు చేసిన పరికరంతో ముందుగానే మూర్ఛవ్యాధి లక్షణాలను గుర్తించవచ్చని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త వెంకటేష్ మూర్తి తెలిపారు. అధ్యయనంలో భాగంగా కెనడాకి చెందిన ఆరు ఆస్పత్రిల్లోని సుమారు నాలుగు వేల మంది రోగులపై పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తలు ఈ సాధనంతో ముఖ్యంగా మూర్ఛ వ్యాధి రావడానికి గల 8 కారణాలను గుర్తించారు. ఈ అధ్యయన వివరాలను కెనడా మెడికల్ అసోసియేషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement