ఐర్లండ్లో ఘనంగా 'ఉగాది వేడుకలు' | Ugadi celebrations grands cermony at irland | Sakshi
Sakshi News home page

ఐర్లండ్లో ఘనంగా 'ఉగాది వేడుకలు'

Mar 26 2015 7:50 PM | Updated on Sep 2 2017 11:26 PM

ఐర్లండ్లో ఘనంగా 'ఉగాది వేడుకలు'

ఐర్లండ్లో ఘనంగా 'ఉగాది వేడుకలు'

మన్మద నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఐర్లండ్లోని ఐర్లండ్ తెలుగు సమాజం అధ్వర్యంలో 'ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

ఐర్లండ్:  మన్మద నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఐర్లండ్లోని ఐర్లండ్ తెలుగు సమాజం అధ్వర్యంలో 'ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. డబ్లిన్లోని హిలీక్స్ హాల్లో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో 500మంది వరకు తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు సినీగాయనీ, సునీత, సింపూలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వారి పాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ అంబాసిడర్ రాధిక లోకేష్ హాజరయ్యారు. మన్మద నామ సంవత్సర ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి ఐర్లండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీధర్ వైకుంఠం, నిర్వహకులు సత్యప్రకాష్ చవడవరపు, మహేష్ అలిమెల్లి, అరవింద్ కరింగుల, రామకృష్ణ మదమంచి, శ్రీనివాస్ కోసనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement