పాక్‌ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి | Suicide Bomber Kills at Least 11 at Pakistani Army Base | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆర్మీపై తాలిబాన్ల ఆత్మాహుతి దాడి

Feb 5 2018 5:24 AM | Updated on Nov 6 2018 7:53 PM

Suicide Bomber Kills at Least 11 at Pakistani Army Base - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాత్‌ జిల్లాలోని ఆర్మీ యూనిట్‌ లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ మేజర్‌ సహా 11 మంది పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. తాలిబాన్లకు గట్టి పట్టున్న స్వాత్‌ లోయలోని ఆర్మీ బేస్‌ సమీపంలో శనివారం ఈ దాడి జరిగినట్లు పాక్‌ ఆర్మీ మీడియా విభాగం తెలిపింది. తొలుత నిషేధిత ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాది.. ఆర్మీ బేస్‌ బయట వాలీబాల్‌ ఆడుతున్న సైనికులు లక్ష్యంగా తనను తాను పేల్చేసుకున్నాడని వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement