ఊళ్లు తిరిగే  ఉద్యోగానికి రూ.72 లక్షల జీతం

Special Story On Perfocal Site - Sakshi

పొద్దస్తమానూ ఆఫీసులో చేసినపనే చేస్తూ బోరు కొడుతోందా?...జీవితాంతం ఇల్లూ..పిల్లలే తప్ప మరో యావ లేక విసుగనిపిస్తోందా?..ఈ ఝంఝాటాలన్నీ వదిలేసి హాయిగా తిరిగేస్తూ బతకాలనిపిస్తోందా...అయితే, ఈ ఉద్యోగం మీ కోసమే. ఇది మాములు ఉద్యోగాల్లాంటిది కాదు! ఆఫీసు టైమింగ్సు, రూల్సు వంటివేమీ ఉండవు. మీరు చేయాల్సిందల్లా మీ బాస్‌తో కలసి విహార యాత్రలకు వెళ్లడం, మంచి మంచి ఫొటోలు తీయడం.

దీనికి మీకొచ్చే జీతం ఎంతో తెలుసా... నెలకు రూ.72 లక్షలు! మీకు ఫొటోలు తీయడం బాగా వస్తే, ప్రయాణాలు చేయడం ఇష్టమయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. బ్రిటన్‌కు చెందిన ధనిక కుటుంబం ఒకటి ఈ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తోంది. వారికి ప్రపంచ వ్యాప్తంగా హాలిడే హోంలు, రిసార్టులున్నాయి. మీరు చేయాల్సింది వారి వెంట తిరగడం. పర్యటనకు సంబంధించి అద్భుతమైన ఫోటోలు తీయడం. మీ విషయాలన్నీ వాళ్లే చూసుకుంటారు.

ఒకే ఒక ఇబ్బంది.. 
ఈ ఉద్యోగంలో ఏడాదికి నెల రోజులు సెలవు కూడా ఇస్తారండోయ్‌. అయితే  వాళ్ల టూర్‌లకు అడ్డం కాకుండా సెలవు తీసుకోవచ్చు. 2019, ఫిబ్రవరి నుంచి ఈ ఉద్యోగం మొదలవుతుంది. ఉద్యోగంలో ఓ ఇబ్బందేమిటంటే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం ఉండదు. ‘ఆ..దాందేముంది..నెలకి లక్షలకు లక్షలకు వస్తోంటే..కుటుంబంతో ఏదోలా మేనేజ్‌ చేసుకోవచ్చు’అంటారా...ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే పెర్‌ఫోకల్‌ సైట్‌కి వెళ్లి దరఖాస్తు పడేయండి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top