పాములతో సరదాగా .... | Snake cafe opens in Tokyo's fashion district | Sakshi
Sakshi News home page

పాములతో సరదాగా ....

Aug 15 2015 1:07 PM | Updated on Oct 22 2018 2:22 PM

పాములతో సరదాగా .... - Sakshi

పాములతో సరదాగా ....

టీవీ చూస్తూనో, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూనో, టీ, కాఫీ తాగేస్తాం. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్నట్లు... వెరైటీగా ...పాముల మధ్య కూర్చొని

టీవీ చూస్తూనో, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తూనో, టీ, కాఫీ తాగేస్తాం. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్నట్లు... వెరైటీగా ...పాముల మధ్య కూర్చొని పానీయాలు సేవించాలనుకుంటే ఈ కేఫ్కు వెళ్లాల్సిందే. ఈ కేఫ్లో ఉండే ప్రతీ టేబుల్పై ఉండేవి విష సర్పాలు కావు. కేవలం కోరలు లేని పాములు మాత్రమే.

అయితే ఈ కేఫ్కు వెళ్లాలంటే మాత్రం మీరు జపాన్లోని టోక్యో సమీపంలోని హిరాజుకు జిల్లాకు వెళ్లాల్సిందే. రూ.523 చెల్లించి కేఫ్లో టేబుల్ను వాడుకోవచ్చు. కాటు వేయని ఈ పాములను పట్టుకోవాలన్నా, వాటికి ఏమైనా ఆహారం అందించాలన్నా అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా  ఈ కేఫ్లో 20 వేర్వేరు జాతులకు చెందిన మొత్తం 35 పాములను పెంచుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement