
టాప్100 సంపాదనపరుల్లో షారుక్,అక్షయ్
ప్రపంచంలో అధిక వేతనం అందుకుంటున్న తొలి 100 మంది ప్రముఖుల సరసన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు.
న్యూయార్క్ : ప్రపంచంలో అధిక వేతనం అందుకుంటున్న తొలి 100 మంది ప్రముఖుల సరసన బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ నిలిచారు. అధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితా - 2016ను అమెరికా మేగజీన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. షారుక్ రూ. 221 కోట్ల సంపదతో 86వ, అక్షయ్ రూ.211 కోట్లతో 94వ స్థానంలో ఉన్నారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ రూ.1,139 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు.