కొత్త పార్లమెంట్‌ భవనం కోసం షారూఖ్‌, అక్షయ్‌ కూమార్‌ల వాయిస్‌ ఓవర్‌

Shah Rukh Khan Akshay Kumar Provide Voice Overs For New Parliament Building Video  - Sakshi

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్శిస్తున్న కొత్త పార్లమెంట్‌ భవనం గురించి మీ వాయిస్‌ ఓవర్‌లతో కూడిన వీడియోలతో సామాజిక మాధ్యమంలో భాగస్వామ్యం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఈ మేరకు మోదీ మే 26న తొలిసారిగా కొత్త పార్లమెంట్‌కి సంబంధించిన వీడియోని షేర్‌ చేస్తూ.. ఈ భవనంపై మీ ఆలోచనల తెలియజేస్తూ..వాయిస్‌ ఓవర్‌ వీడియోలను షేర్‌ చేయాలని, వాటిలో కొన్నింటిని మళ్లీ ట్వీట్‌ చేస్తానని చెప్పారు. 

మోదీ ప్రత్యేక అభ్యర్థన మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తమ వాయిస్‌ ఓవర్‌లతో కూడిన వీడియోలను షేర్‌ చేశారు. ఆయా పోస్టులను శనివారం ప్రధాని మోదీ.. తాను చెప్పినట్లుగానే కొన్నింటిని రీట్వీట్‌ చేశారు. అందులో భాగంగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌లు షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లు పోస్ట్‌ చేసిన వాయిస్‌ ఓవర్‌ వీడియోలను మోదీ రీట్వీట్‌ చేశారు.మోదీ.. ఆయా వీడియోలో భవనం గురించి ‍వ్యాఖ్యానం లేదా నేపథ్య సంగీతం ఉండాలనే నియమం ఏమిలేదని, కేవలం మీ ఆలోచనలు తెలుసుకునేందుకేనని పేర్కొన్నారు.

ఈ మేరకు షారూఖ్‌ షేర్‌ చేసిన  వీడియాలో.. మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజలకు కొత్త ఇ‍ల్లు అని పిలిచారు. ఇది మన ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మంది భారతీయులు ఒకే కుటుంబంగా మారిన మన రాజ్యంగాన్ని సమర్థించే ప్రజల ఇల్లు. ఈ ఇల్లు చాలా పెద్దగా ఉండనివ్వండి.. ఎదుకంటే ‍ప్రతి గ్రామం, నగరం, దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తగినంత చోటు ఉంటుంది. ఈ కొత్త ఇల్లు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఆలింగనం చేసుకుంటుందని చెబుతూ..న్యూ ఇండియా కోసం కొత్త పార్లమెంట్‌ భవనం అనే క్యాప్షన్‌ జోడిస్తూ వాయిస్‌ ఓవర్‌ వీడియోని పోస్ట్‌ చేశారు షారుఖ్‌.

అంతేగాదు దీన్ని పురాతన సంప్రదాయ మేళవికతో భారతదేశ కీర్తిని మరింత అందంగా ఇనుమడింప చేశారంటూ మోదీని కొనియాడాడు షారూఖ్‌. అలాగే అక్షయ్‌ కుమార్‌ వాయిస్‌ ఓవర్‌ వీడియోని కూడా రీట్వీట్‌ చేశారు మోదీ. ఆ వీడియోలో..అక్షయ్‌ కుమార్‌ కొత్త పార్లమెంటు భవనాన్ని భారతదేశ వృద్ధి కథకు ఐకానిక్‌ సింబల్‌గా అభివర్ణించారు. ఈ భవనం మన గొప్ప వారసత్వానికి ప్రతీక అన్నారు. అక్షయ్‌ మాటలతో ఏకభవిస్తూ మోదీ ఈ వీడియోని పంచుకున్నారు. ఈ మేరకు ఆయన కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించడానికి ఒక్క రోజు వ్యవధి ఉందనంగా.. కొన్ని గంటల ముందు మోదీ ఆ వాయిస్‌ ఓవర్‌ వీడియోలను నెటిజన్లతో పంచుకున్నారు.

వీడియోల తోపాటు మోదీ అనుపమ్‌ ఖేర్‌, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీతో సహా ప్రముఖుల, రాజకీయ నాయకులు కొత్త పార్లమెంట్‌ భవనంపై పంచుకున్న తమ ఆలోచనలను రీట్వీట్‌ చేశారు. ఇకపోతే అనుపమ్‌ ఖేర్‌ పద్యాలతో పార్లెమంట్‌ భవనం విశిష్టతను ప్రశంసించగా, మోదీ మీ కవితలు ప్రజలకు ఈ భవనం పట్ల మరింత విశ్వాసాన్నిపెంచుతాయని అనుపమ్‌ని మెచ్చుకున్నారు.

ఉండగా, తమిళనాడు ప్రముఖ సిని హిరో రజనీకాంత్‌ సైత మోదీ సెంగోల్‌ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..తమిళులు గర్వపడేలా చేశారన్నారు. అందుకు మోదీ కొత్త పార్లమెంట్‌ భవనంలో తమిళనాడు సంస్కృతి గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. రజనీకాంత్‌కు సమాధానమిచ్చారు. కాగా, అధీనం సీర్స్ ప్రధాని మోదీకి సెంగోల్‌ను అందజేశారు. దీన్ని కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో మే 28న ప్రధాని మోదీ ఏర్పాటు చేయనున్నారు.

(చదవండి: పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం.. లైవ్‌ అప్‌ డేట్స్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top