సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి | School attacks killed 160 Syrian children says UN | Sakshi
Sakshi News home page

సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి

Jan 7 2015 11:42 AM | Updated on Sep 15 2018 5:45 PM

సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి - Sakshi

సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి

సిరియాలో గత ఏడాది పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్థులు మరణించారని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది.

జెనీవా: సిరియాలో గత ఏడాది పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్థులు మరణించారని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. మరో 343 మంది గాయాలపాలయ్యారని తెలిపింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన పాఠశాలపై దాడి చేసి మరణహోమం సృష్టించడం దారుణమని వ్యాఖ్యానించింది. 2014లో సిరియాలోని పాఠశాలలపై 68 సార్లు దాడులు జరిగాయని వివరించింది.

దేశంలో 13 నుంచి 16 లక్షల మంది చిన్నారులు విద్యకు దూరంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో గత అయిదేళ్లుగా జరుగుతున్న దాడుల్లో 2 లక్షల మంది వరకు మరణించారని గుర్తు చేసింది. దేశంలోని చిన్నారులపై ఇస్లామిక్ తీవవ్రాద సంస్థల ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement