భారత్‌పై ఆంక్షలతో అమెరికాకే నష్టం

Sanctions On India Over Defence Deal With Russia Will Hit US, Says Jim Mattis - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించినా చివరకు అమెరికానే నష్టపోవాల్సి వస్తుందని ఆ దేశ రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఇటీవల తీసుకొచ్చిన కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌(సీఏఏటీఎస్‌ఏ) నుంచి భారత్‌కు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం నాడిక్కడ సెనెట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ ముందుకు హాజరైన మాటిస్‌ సభ్యులడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రష్యాతో రక్షణ, నిఘా సంబంధాలు కలిగిఉండే దేశాలను శిక్షించేందుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించిన సీఏఏటీఎస్‌ చట్టం ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీనిప్రకారం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్మదు. భారత్‌ సహా కొన్ని దేశాలు ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top