నాస్తికత ఇలా కూడా వస్తుందా?

Is this the same as atheism? - Sakshi

ఎడమచేతి వాటం ఉంటే తెలివిగల వారు అని చాలా మంది నమ్ముతారు. అయితే ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే ఎడమ చేతి వాటం ఉంటే నాస్తికులుగా మారే అవకాశం ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. జన్యుపరమైన మార్పుల కారణంగా ఎడమచేతి వాటం వస్తుందని, ఈ కారణం నాస్తిత్వానికి దారి తీస్తుందని గుర్తించారు.

దేవుడిని నమ్మే వారిలోనూ కొన్ని జన్యుపరమైన ప్రభావాలు ఉంటాయని కూడా తేల్చారు. పారిశ్రామికంగా ప్రపంచం అభివృద్ధి చెందకముందు మానవుల్లో మత ప్రభావం అధికంగా ఉండేదని ఫిన్‌లాండ్‌లోని ఓలూ యూనివర్సిటీ పరిశోధకులు వివరిస్తున్నారు. మత నియమాలు పాటించడం వల్ల సత్ప్రవర్తన అలవడి మానసిక ఆరోగ్యం లభించడం వల్ల ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉండేవారని పేర్కొన్నారు. దాదాపు 40 శాతం మందిలో జన్యుపరంగానే ఆధ్యాత్మిక అలవడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top