లండన్ డిప్యూటీ మేయర్‌గా రాజేశ్ అగర్వాల్ | Rajesh Agarwal as Deputy Mayor of London | Sakshi
Sakshi News home page

లండన్ డిప్యూటీ మేయర్‌గా రాజేశ్ అగర్వాల్

Jul 1 2016 2:52 AM | Updated on Sep 4 2017 3:49 AM

లండన్ డిప్యూటీ మేయర్‌గా రాజేశ్ అగర్వాల్

లండన్ డిప్యూటీ మేయర్‌గా రాజేశ్ అగర్వాల్

బ్రెగ్జిట్ కారణంగా లండన్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించటంలో మేయర్ సాదిక్ ఖాన్‌తో కలిసి క్రియాశీలకంగా వ్యవహరిస్తానని..

లండన్: బ్రెగ్జిట్ కారణంగా లండన్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించటంలో మేయర్ సాదిక్ ఖాన్‌తో కలిసి క్రియాశీలకంగా వ్యవహరిస్తానని.. లండన్ కొత్త డిప్యూటీ మేయర్ (బిజినెస్)గా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తోపాటు ప్రపంచదేశాలకు లండన్ చాలా కీలక ప్రాంతమని.. అందుకే ఇక్కడ పరిస్థితులు కుదురుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు.

విదేశీ మారక ద్రవ్య సేవల సంస్థకు సీఈవోగా ఉన్న రాజేశ్ అగర్వాల్‌ను బుధవారం లండన్ డిప్యూటీ మేయర్ (బిజినెస్)గా..  మేయర్ సాదిక్ ఖాన్ నియమించారు. లండన్‌తోపాటు బర్మింగ్‌హామ్, ఫ్‌రాన్స్, స్పెయిన్‌లోనూ రాజేశ్ వ్యాపారం విస్తరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి లండన్‌కు వచ్చిన ఈయన.. చిన్న కంపెనీతో జీవితం ప్రారంభించి.. నేడు వేల కోట్లకు అధిపతయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement