ప్రజలు లేకుండానే పోప్‌ ప్రార్థనలు

Pope Celebrates Palm Sunday Service Without the Public in Basilica church - Sakshi

వాటికన్‌ సిటీ: కరోనా కారణంగా వాటికన్‌ సిటీ వెలవెలబోయింది. ఏటా గుడ్‌ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరుపుకునే మ్రానికొమ్మల (పామ్‌) ఆదివారం ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి వేలాది సంఖ్యలో హాజరయ్యే వారు. కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో ఈ ఏడాది వాటికన్‌ సిటీని మూసివేయడంతో, భక్తులు లేకుండానే పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్‌ పీటర్స్‌ బసిలికా లోపలే నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ అతి తక్కువ మంది హాజరు కాగా, వారు కూడా భౌతిక దూరాన్ని పాటించారు. ఈ సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి మానవాళి ఆశలపై గండి కొట్టిందని, హృదయాలపై మోయరాని భారాన్ని పెట్టిందని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top