వల్గర్ సెల్ఫీలు.. చిక్కుల్లో మహిళా పోలీస్..! | Police woman sacked after posing for vulgar selfies in her uniform | Sakshi
Sakshi News home page

వల్గర్ సెల్ఫీలు.. చిక్కుల్లో మహిళా పోలీస్..!

May 12 2016 10:16 AM | Updated on Oct 22 2018 6:02 PM

వల్గర్ సెల్ఫీలు.. చిక్కుల్లో మహిళా పోలీస్..! - Sakshi

వల్గర్ సెల్ఫీలు.. చిక్కుల్లో మహిళా పోలీస్..!

టాప్ లెస్ సెల్ఫీలు దిగడం, డ్యూటీ యూనిఫాంలో ఉండగా తమకు ఇష్టం వచ్చినట్లుగా సెల్ఫీలు దిగడం వాటిని సోషల్ మీడియాలో మహిళా పోలీసులు పోస్ట్ చేస్తున్నారు.

బీజింగ్: టాప్ లెస్ సెల్ఫీలు దిగడం, డ్యూటీ యూనిఫాంలో ఉండగా తమకు ఇష్టం వచ్చినట్లుగా సెల్ఫీలు దిగడం వాటిని సోషల్ మీడియాలో మహిళా పోలీసులు పోస్ట్ చేయగా, ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం ఆ తర్వాత ఉద్యోగం కోల్పోవడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల అమెరికాలో జరిగిన సంఘటనకు ఉదాహరణలాగ మరోకటి చైనాలో రెండు రోజుల కిందట చోటుచేసుకుంది. ఓ మహిళా అసభ్యంగా ఫొటోలు దిగడం అవి ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.

యువకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిందంటూ కొందరు యూజర్లు కామెంట్ చేయగా, ఆమె చాలా సెక్సీగా ఉందంటూ మరికొన్ని కామెంట్లు విపరీతంగా వచ్చాయి. డ్యూటీ యూనిఫాంలో ఉండగా ఇలాంటి పనులేంటని తీవ్రంగా విమర్శించారు. బ్యాడ్జ్ నంబర్ కనిపించేలా దిగిన సెల్ఫీని పోస్ట్ చేయడం ఆమె చేసిన ఘోర తప్పిదమని తెలివైన కామెంట్లు కూడా చేశారు. డాండోంగ్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుందని ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ఓ అధికారి పేర్కొన్నారు. ఆమె 1994లో జన్మించిందని చెప్పిన ఆఫీసర్స్ పేరును వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.

లియానోయింగ్ అనే ప్రాంతానికి చెందిన ఓ మహిళా పోలీస్ సరదా కోసం చేసిన చిన్న పని ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. ఆమె పోలీసు  యూనిఫాంలోనే కాస్త అసభ్యంగా ఫొటోలు దిగింది. ముద్దిస్తున్నట్లుగా, కన్ను కొడుతున్నట్లుగా కొన్ని ఫోజుల్లో దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇక అంతే, ఈ యంగ్ పోలీస్ అందానికి దాసోహమైన కుర్రకారు ఆ ఫొటోలను విపరీతంగా షేర్ చేసింది. డ్యూటీ యూనిఫాంలోనే ఉండి కూడా పూర్తిగా దుస్తులు వేసుకోకుండా, అసభ్యంగా ఫోజులతో ఫొటోలు దిగిందంటూ ఆమెపై అధికారులు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement