ట్రైనర్‌ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది | Police Dog faced the bullet for the trainer | Sakshi
Sakshi News home page

ట్రైనర్‌ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది

May 15 2017 12:40 AM | Updated on Aug 25 2018 7:52 PM

ట్రైనర్‌ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది - Sakshi

ట్రైనర్‌ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది

శిక్షణ పొందిన పోలీస్‌ కుక్క క్రమశిక్షణలో సైనికుడికి ఏమాత్రం తీసిపోదని మరోమారు నిరూపితమైంది.

విధి నిర్వహణలో ప్రాణాలను లెక్కచేయని పోలీస్‌ డాగ్‌

హూస్టన్‌: శిక్షణ పొందిన పోలీస్‌ కుక్క క్రమశిక్షణలో సైనికుడికి ఏమాత్రం తీసిపోదని మరోమారు నిరూపితమైంది. అమెరికాలోని హూస్టన్‌ నగరంలో కె9 కాస్పర్‌ అనే ఈ జాగిలం ఉంది. ఇది గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రక్షణ విభాగంలో విధులు నిర్వహించింది. పామ్‌ బీచ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన ఈ జాగిలం ప్రస్తుతం కోలుకుంటోంది. ఫిలిప్‌ ఓషియా అనే వ్యక్తి శుక్రవారం ఫ్లోరిడాలోని జుపిటర్‌లో దోపిడీకి పాల్పడి అడ్డొచ్చినవారిపై కాల్పులకు దిగాడు.

మరుసటిరోజు తనని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కాస్పర్‌ తన ట్రైనర్‌ను రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిందని, ప్రస్తుతం కోలుకుంటోందని పోలీస్‌ కార్యాలయం అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించారు. చికిత్స పొందుతున్న జాగిలం ఫొటోలను కూడా అందులో పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement