థాయ్‌లాండ్‌లో వరుస పేలుళ్లు.. ఒకరు మృతి | One killed, several injured in serial blasts in Thailand | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో వరుస పేలుళ్లు.. ఒకరు మృతి

Aug 24 2016 8:13 AM | Updated on Sep 4 2017 10:43 AM

థాయ్‌లాండ్‌లోని పట్టాని రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు.

థాయ్‌లాండ్‌లోని పట్టాని రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి జరిగింది. రాత్రి 10.40 గంటల సమయంలో ఓ పబ్‌కు సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో బాంబులు పేలాయి. రాత్రి 11 గంటల సమయంలో మరో కారు బాంబు పేలింది.

దాంతో ఓ మహిళ మరణించగా, 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలోని చెత్తబుట్టలో దాచి ఉంచిన మూడో బాంబు రాత్రి 11.30 సమయంలో పేలింది. అయితే ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకుముందు ఉత్తర థాయ్‌లాండ్‌లో జరిగిన వరుస పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement