చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ

Nikki Haley Slams China Cares More About Its Reputation Over COVID 19 - Sakshi

ముదిరిన అమెరికా- చైనా ‘కరోనా’ మాటల యుద్ధం

వాషింగ్టన్‌: మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మహమ్మారి కరోనా సృష్టిస్తున్న అలజడి కారణంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాణాంతక వైరస్‌  ప్రపంచమంతా విస్తరించడానికి చైనానే కారణమంటూ అమెరికా ఆరోపిస్తుండగా.. అమెరికా వల్లే ఈ దుస్థితి దాపురించిందని చైనా ఎదురుదాడికి దిగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనాను చైనీస్‌ వైరస్‌ అని సంబోధించడం సహా చైనా వెల్లడిస్తున్న కరోనా గణాంకాలపై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో అధికార రిపబ్లికన్లు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీపై విమర్శల పర్వానికి తెరలేపారు. దీంతో కరోనా సంక్షోభం క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది.(కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’)

ఇక తాజాగా ఐరాసలో అమెరికా మాజీ రాయబారి, భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ సైతం చైనాపై వాగ్యుద్ధానికి దిగారు. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలపై చైనా చెప్పే లెక్కలను నమ్మలేమని అనుమానాలు వ్యక్తం చేశారు. బీజింగ్‌ గణాంకాలను నమ్మకూడదంటూ అమెరికా సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ శ్వేతసౌధ వర్గాలకు సూచించడాన్ని సమర్థించారు. ఈ మేరకు... ‘‘1.5 బిలియన్‌ జనాభా ఉన్న చైనాలో కేవలం 82,000 వేల కరోనా కేసులు, 3300 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇవి కచ్చితంగా నిజమైన లెక్కలు కావు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. చైనాకు ప్రపంచ దేశాల సంక్షేమం కంటే కూడా తమ పరువే ముఖ్యమని.. అందుకే వైరస్‌పై గోప్యత పాటించిందని విమర్శించారు. తమ దేశంలో పుట్టిన వైరస్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు సహాయం చేయడం కంటే చైనాకు పేరు ప్రఖ్యాతులపైనే ఎక్కువ దృష్టి ఉందని దుయ్యబట్టారు. (‘93 వేల మంది ప్రాణాలకు ముప్పు’)

కాగా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి అక్కడ 81,589 కరోనా బాధితులు ఉండగా... 3318 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. జాన్‌ హ్యాప్కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అగ్రరాజ్యంలో 236339 కరోనా కేసులు నమోదు కాగా.. 5 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది కరోనా బారిన పడగా... 51,485 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.  (చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా)

చదవండి: భారత్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ బిలియన్‌ డాలర్ల సాయం!

ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-05-2020
May 28, 2020, 11:50 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి...
28-05-2020
May 28, 2020, 11:37 IST
కరోనా వైరస్‌ భయంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలోనే క్రిమి సంహారిని శానిటైజర్‌ వాడకం...
28-05-2020
May 28, 2020, 10:52 IST
భోపాల్ :  క‌రోనా..అంద‌రి జీవితాల్లో పెను మార్పుల‌కు దారి తీసింది. పెళ్ల‌యిన కొద్ది గంట‌ల‌కే కొత్త జంట‌ను క్వారంటైన్ పాలు...
28-05-2020
May 28, 2020, 10:29 IST
కోల్‌కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే....
28-05-2020
May 28, 2020, 10:19 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌...
28-05-2020
May 28, 2020, 10:09 IST
కరోనా వైరస్‌ గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకు సగటున 30 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు జనం...
28-05-2020
May 28, 2020, 10:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌... ఈ పేరు ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది. రెక్కాడితే...
28-05-2020
May 28, 2020, 09:36 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు...
28-05-2020
May 28, 2020, 09:24 IST
దుండిగల్‌: కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణి బుధవారం కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి...
28-05-2020
May 28, 2020, 09:18 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌–19 నగర ప్రజల్లో ఎంతోమార్పు తెచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావం బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన పలు...
28-05-2020
May 28, 2020, 08:55 IST
సాక్షి, సిటీబ్యూరో: కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలు అన్నట్లు.. అటు కోవిడ్‌ వైరస్‌.. ఇటు మార్కెట్‌ తరలింపు.. ఆపై రవాణా...
28-05-2020
May 28, 2020, 08:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల అనేక కష్టాల మధ్య ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త....
28-05-2020
May 28, 2020, 08:26 IST
చూపులతో మొదలై.. మూడు ముళ్లతో ముగిసే పెళ్లికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక ఇంట్లో పెళ్లంటే.. బంధువుల...
28-05-2020
May 28, 2020, 06:11 IST
న్యూఢిల్లీ: పాపం పుణ్యం, ప్రపంచమార్గం ఏదీ తెలియని ఓ పసివాడు, రైల్వే ప్లాట్‌ఫాంపై విగతజీవిగా పడివున్న తల్లి శవంపై కప్పిన...
28-05-2020
May 28, 2020, 06:02 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,002గా ఉంది. గడిచిన 24 గంటల్లో...
28-05-2020
May 28, 2020, 05:25 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరి కొన్నాళ్లు కొనసాగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే సమాచారం...
28-05-2020
May 28, 2020, 05:19 IST
న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: 1,51,767 పాజిటివ్‌ కేసులు, 4,337 మరణాలు. దేశంలో కరోనా  సృష్టించిన విలయమిది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ...
28-05-2020
May 28, 2020, 05:02 IST
ఎందరికో అదొక కలల నగరం ఉపాధి అవకాశాలతో ఎందరినో అక్కున చేర్చుకున్న నగరం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శ్రమించే నగరం ఇప్పుడు...
28-05-2020
May 28, 2020, 03:54 IST
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరుతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, మే నెల...
28-05-2020
May 28, 2020, 03:45 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు, మూడు నెలల్లో దేశంలో పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top