క్షయను రూపుమాపే కొత్త మందు | A new drug that eliminates Tuberculosis | Sakshi
Sakshi News home page

క్షయను రూపుమాపే కొత్త మందు

Oct 24 2018 1:38 AM | Updated on Oct 24 2018 1:38 AM

పారీస్‌: మందులకు లొంగకుండా ప్రపంచంలోని అనేక మందిని వేధిస్తున్న క్షయ వ్యాధికి నూతన చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుత వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందికి క్షయ వ్యాధిని శాశ్వతంగా దూరం చేయవచ్చన్నారు. ప్రస్తుతమున్న చికిత్సా విధానం ద్వారా కేవలం 55 శాతం మందికే క్షయ వ్యాధిని తగ్గించవచ్చు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఈ నూతన విధానం సత్ఫలితాలను అందించినట్లు వివరించారు.

ప్రపంచంలోనే అత్యధిక క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న బెలారస్‌ దేశంలోని డాక్టర్లు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చికిత్సలో ముఖ్యమైనది బెడాక్విలైన్‌ ఔషధం. చికిత్సలో భాగంగా 181 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు కొన్ని నెలల పాటు బెడాక్విలైన్‌ ఔషధంతోపాటు ఇతర యాంటీబయాటిక్స్‌ కూడా అందించారు. మొత్తం కోర్సును పూర్తిచేసిన 168 మందిలో 144 మంది క్షయ నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement