దుమారం రేపుతున్న 'న్యూడ్‌' పెయింటింగ్! | Naked Donald Trump coming to London | Sakshi
Sakshi News home page

దుమారం రేపుతున్న 'న్యూడ్‌' పెయింటింగ్!

Apr 7 2016 12:12 PM | Updated on Sep 3 2017 9:25 PM

దుమారం రేపుతున్న 'న్యూడ్‌' పెయింటింగ్!

దుమారం రేపుతున్న 'న్యూడ్‌' పెయింటింగ్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు తెగ తపన పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ సహజంగానే వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు తెగ తపన పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ సహజంగానే వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు. ఇక ఆయన లండన్‌లో 'నగ్నం'గా అడుగుపెడితే ఎలా ఉంటుంది.. పెనుదుమారమే! నిజానికి ట్రంప్‌ ఒంటి మీద నూలుపోగు లేకుండా లండన్‌కు రావడం లేదు. కానీ ఆయన 'నగ్నంగా' ఉన్న పెయింటింగ్‌ మాత్రం త్వరలోనే ఈ యూరప్‌ నగరాన్ని చేరనుండటం వివాదం రేపుతోంది.

అమెరికా ఆర్టిస్ట్ ఇల్మా గోర్‌ 'మేక్ అమెరికా గ్రేట్‌ అగైన్‌' పేరుతో ఈ పెయింటింగ్‌ను వేసింది. ఒంటిమీద నూలుపోగు లేకుండా ట్రంప్‌ ఎలా ఉంటాడో ఊహిస్తూ.. ఏ టు జెడ్‌ ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా ఆమె ఈ చిత్రాన్ని వేసింది. సహజంగానే ఈ పెయింటింగ్ అమెరికాను కుదిపేసింది. ఈ పెయింటింగ్‌ను వ్యతిరేకిస్తూ ట్రంప్ అభిమానులు ఆమెను చంపేస్తామంటూ వెయ్యికిపైగా బెదిరింపులు చేశారు. ఫేస్‌బుక్‌లో ఈ పెయింటింగ్ పోస్టు చేసేందుకు ఆమె రెండుసార్లు ప్రయత్నించగా.. ఆ సైట్ ఇందుకు నిరాకరించింది. రెండుసార్లు ఆ పెయింటింగ్‌ను తొలగించింది. ఈ-బేలో వేలం వేసేందుకు రెండుసార్లు ప్రయత్నించినా.. చుక్కెదురైంది.

ఫ్రిబవరి 9న తాను ఈ పెయింటింగ్‌ను ఫేస్‌బుక్ లో పోస్టు చేశానని, దీనిని 2.60 లక్షల మంది షేర్ చేసుకున్నారని, అయితే ఇంతటి స్పందన వస్తున్న ఫేస్‌బుక్ దీనిని తొలగించిందని గోర్‌ తెలిపారు. అమెరికాలోని పెన్సిల్ అండ్ ఆయిల్ పెయింట్ ఆర్ట్‌ వర్క్‌ గ్యాలరీలో ఈ పెయింటింగ్ ప్రదర్శించడానికి ఆమె ప్రయత్నించగా అక్కడా అనుమతి లభించలేదు. దీంతో ఆమె ఈ పెయింటింగ్‌తో లండన్‌కు రావాలని నిర్ణయించుకున్నారు. మే ఫెయిర్‌లో భాగంగా మాడాక్స్‌ గ్యాలరీలో ఈ పెయింటింగ్ ప్రదర్శించాలని ఆమె భావిస్తున్నారు.

విద్వేష భాష, విపరీతమైన సంకుచిత వ్యాఖ్యలతో వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లో నిలిచిన రిపబ్లికన్ హోప్‌ఫుల్ టంప్ర్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు పెయింటింగ్స్‌ వచ్చాయి. కెనడియన్ కామెడియన్ కళాకారిణి డేవిసన్‌ తన వక్షోజంతో ట్రంప్‌ చిత్రాన్ని గీసి.. ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టింది. 'ఇంటర్నెట్‌లో అతడు అతిపెద్ద బూబ్‌' అంటూ ట్రంప్‌ ధోరణిపై వ్యంగ్యాస్త్రాలను సంధించింది.

Advertisement
 
Advertisement
Advertisement