2050 నాటికి ముస్లిం జనాభా.. మూడింతలు | Sakshi
Sakshi News home page

2050 నాటికి ముస్లిం జనాభా.. మూడింతలు

Published Fri, Dec 1 2017 9:17 AM

Muslim population in EU could triple by 2050 - Sakshi

లండన్‌ : మధ్యప్రాచ్యంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాలు.. ఐరాపాను వణికిస్తున్నాయి.  2050 నాటికి ఐరోపా దేశాల్లో ముస్లింల జనాభా మూడింతలు పెరగనుందని అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్‌ ప్రకటించిన తాజా సర్వేతో ఐరోపా దేశాలు.. విలవిల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఇరాక్‌, సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌ వంటి దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు ఐరోపాకు శరణార్థులుగా వలస వెళ్లారు. వీరు అక్కడే స్థిరపడ్డంతో.. జనాభా గణనీయంగా పెరుగుతుందని ప్యూ సర్వే ప్రకటించింది.


జర్మనీలో 2016 నాటికి 6.1 శాతం ఉన్న ముస్లిం జనాభా.. 2050 నాటికి 19.7 శాతానికి చేరుకుంటుందని ప్యూ సర్వే ప్రకటించింది. ఐరోపా సమాఖ్యలోని 28 దేశాల్లోనూ ముస్లింల జనాభా ఇదే నిష్పత్తిలో పెరుగుతుందని ప్యూ రీసెర్చ్‌ అంచనాలు  వేస్తోంది. అలాగే మొత్తం ఐరోపా జనాభాలో 2016 నాటికి కేవలం 4.9 శాతం ముస్లింల జనాభా 2050 నాటికి 25.8 మిలియన్లకు చేరుకుంటుందని ప్యూ సంస్థ అంచనా వేస్తోంది.

Advertisement
Advertisement