ఆ సినిమాలు చూస్తే.. నెలకు రూ. 2లక్షల జీతం! | more than 2 lakhs salary offered per month for watching porn | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలు చూస్తే.. నెలకు రూ. 2లక్షల జీతం!

Apr 16 2016 12:36 PM | Updated on Sep 18 2018 7:52 PM

ఆ సినిమాలు చూస్తే.. నెలకు రూ. 2లక్షల జీతం! - Sakshi

ఆ సినిమాలు చూస్తే.. నెలకు రూ. 2లక్షల జీతం!

డెన్మార్క్‌లోని ఓ బార్ ఓ విచిత్రమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే.. ఏకంగా రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని చెబుతోంది.

డెన్మార్క్‌లోని ఓ బార్ ఓ విచిత్రమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే.. ఏకంగా రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని చెబుతోంది. అలా చూస్తామని చెప్పినవాళ్లలోంచి ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన స్థలం అన్నీ ఇస్తారట. అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయంపై మాత్రం ఇంతవరకు వాళ్లకు స్పష్టత లేదు. బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని మాత్రం హార్న్‌స్లెత్ బార్ చెబుతోంది.

తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు. ఏదో సరదాగా వచ్చేవాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామన్నారు. వాళ్లకు 'డీజే' లాగే 'పీజే' అనే టైటిల్ ఇస్తామన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈమెయిల్ రాయాలని తెలిపారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50-60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement