గోప్యత మానవహక్కే: సత్య నాదెళ్ల

Microsoft CEO Satya Nadella Says Privacy Is a Human Right - Sakshi

లండన్‌: గోప్యతను మానవ హక్కుగా భావించాలని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల టెక్నాలజీ సంస్థలకు పిలుపునిచ్చారు. సైబర్‌ నేరాల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, సంస్థలు కలసి పనిచేయాలని కోరారు. లండన్‌లో గురువారం జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో గోప్యత, సైబర్‌ భద్రత, కృత్రిమ మేధ తదితరాలను ఆయన ప్రస్తావించారు. డిజిటల్‌ ప్రపంచంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా గోప్యతను మానవ హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. సైబర్‌ దాడులకు గురయ్యే వర్గాలను కాపాడటం సాంకేతిక పరిశ్రమ ఒక్కదాని వల్లే కాదని, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. యూరప్‌లో కఠిన ఆన్‌లైన్‌ ప్రైవసీ ప్రమాణాలు నెలకొల్పేందుకు తీసుకొచ్చిన చట్టం జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ను ప్రశంసించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top