కుక్కను కరిచాడు: అరెస్ట్‌ అయ్యాడు!

man bites dog in us - Sakshi

హ్యూస్టన్‌: మనిషిని కుక్క కరిస్తే అది వార్త కాదు... కుక్కను మనిషే కరిస్తేనే అది వార్తవుతుందని సరదాగా చెప్పుకుంటారు. కుక్కను మనిషి కరవడం అనేది నిజంగా జరుగుతుందా? అలాంటి వార్తను మనం చదువుతామా? అని ఎంతోమంది అనుకోవచ్చు. ఇక ఆ లోటు కూడా తీరిపోయింది. కుక్కను కరిచాడనే ఆరోపణలపై అమెరికా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అదీ.. అలాంటి ఇలాంటి శునకం కాదు, మనోడు ఏకంగా పోలీసు కుక్కనే కరిచాడట. 

వివరాల్లోకి వెళితే... న్యూ హాంప్‌షైర్‌కు చెందిన ఓ వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ ఓ చోట దాక్కున్నాడు. దానిని గమనించిన జాగిలం.. సదరు దొంగ దగ్గరకు పరిగెత్తి, మొరగడం మొదలుపెట్టింది. దీంతో దాని అరుపులకు ఎక్కడ పోలీసులు వచ్చి తనను అరెస్టు చేస్తారో అనే భయంతో ఆ శునకాన్ని పట్టుకొని కరిచేశాడు. దీంతో ఆ శునకం మరింత పెద్దగా అరవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అవాక్కయ్యారు. అతడి చేతుల్లో నుంచి శునకాన్ని కాపాడి, ఆపై ఆ చేతులకు బేడీలు వేశారు. శునకాన్ని కరిచిన నేరం కింద అరెస్టు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top