లండన్‌ ఎయిర్‌పోర్టు మూసివేత! | London Airport Closed after Bomb Found | Sakshi
Sakshi News home page

Feb 12 2018 11:00 AM | Updated on Feb 12 2018 11:46 AM

London Airport Closed after Bomb Found - Sakshi

లండన్‌ సిటీ ఎయిర్‌పోర్టు లోపలి దృశ్యం

లండన్‌ : బాంబు వార్తతో లండన్‌ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆదివారం సిటీ ఎయిర్‌పోర్టు వద్ద బాంబు జాడ లభ్యం కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

థేమ్స్‌ నది ఒడ్డున కింగ్‌ జార్జి వీ డాక్‌ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో ఈ బాంబు బయటపడింది. రన్‌ వేకు ఈ ప్రాంతంలో సమీపంలో ఇది ఉండటంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను బయటకు పంపించి వేసిన అధికారులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిర్‌పోర్టు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శక్తివంతమైన ఈ బాంబు బహుశా రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.   

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబర్‌ 1940, 1941 మే నెలల మధ్య లండన్‌ నగరంపై దాడి చేసిన జర్మన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దళాలు వేల సంఖ్యలో బాంబులను నగరంపైకి జారవిడిచాయి. 

ఇది కూడా చదవండి... 4000 మందిని కాపాడారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement