ఎల్‌ఈడీ బల్బులతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ బల్బులతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

Published Wed, Jun 29 2016 8:10 PM

ఎల్‌ఈడీ బల్బులతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

లండన్: స్మార్ట్ ఎల్‌ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్) లైట్లను ఉపయోగించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను కనెక్ట్ చేయవచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. బొమ్మలు, మన ఇంట్లో ఉండే వివిధ రకాల వస్తువులకు బల్బుల నుంచి వచ్చే కాంతి ద్వారా నెట్‌వర్క్‌ను అనుసంధానించవచ్చని వారు చెబుతున్నారు.

ఇళ్లలో వాడే ఎల్‌ఈడీ బల్బులు కాంతిని ప్రసరించడంతోపాటు లైటు సెన్సార్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని సందేశాలు పంపుకోగలవు, వస్తువులకు కనెక్ట్ అవ్వగలవు. గృహోపకరణాలు, ధరించదగిన వస్తువులు, సెన్సార్లు, బొమ్మలను బల్బుల కాంతితో కలిపి ఉంచడానికి ఎల్‌ఈడీల ద్వారా వీలవుతుంది. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు చేశారు.

Advertisement
Advertisement