తొమ్మిదేళ్లకే డిగ్రీ.. ఆపై..

Laurent Simons Drags Attention As Became Youngest Person To Complete Degree - Sakshi

ఆమ్‌స్టర్‌డాం: తొమ్మిదేళ్ల వయస్సులోనే లారెంట్‌ సిమ్మన్స్‌ అనే బాలుడు అద్భుతం సృష్టించాడు. అతిపిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కనున్నాడు. తద్వారా ప్రపంచంలోనే అతిపిన్న వయస్సులో డిగ్రీ సాధించిన వ్యక్తిగా పేరొందిన మైఖేల్‌ కెర్నీ(10 ఏళ్లకు అలబామా యూనివర్సిటీ) రికార్డును అధిగమించనున్నాడు. వివరాలు.. ఆమ్‌స్టర్‌డాంకు చెందిన సిమ్మన్స్‌ ఇందోవన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో  ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే నెలలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పట్టా పుచ్చుకోనున్నాడు. అనంతరం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

 

ఈ విషయం గురించి అతడి తల్లిదండ్రులు లిదియా, అలెగ్జాండర్‌ సిమ్మన్స్‌ మాట్లాడుతూ చిన్నతనం నుంచే లారెంట్‌ అసాధారణ ప్రతిభా పాటవాలు(ఐక్యూ 145) కనబరిచే వాడని చెప్పుకొచ్చారు. ఈ చిచ్చర పిడుగు తమకు చాలా ప్రత్యేకమని పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కేవలం తాను చదువుకు మాత్రమే పరిమితమైపోలేదని.. ఆటపాటల్లోనూ ముందుంటాడని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా సైట్లలో కూడా యాక్టివ్‌గా ఉంటాడని.. తనకు ఇన్‌స్టాగ్రాంలో 11 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. ఇక తొమ్మిదేళ్లకే డిగ్రీ పూర్తి చేయడం తనకు ఆనందంగా ఉందన్న లారెంట్‌... ఇంజనీరింగ్‌తో పాటు మెడిసిన్‌ పట్ల కూడా తనకు అభిరుచి ఉందని తెలిపాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top