లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు

Latin America sees surge of coronavirus cases on Record levels - Sakshi

బెర్లిన్‌: లాటిన్‌ అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆ దేశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల్ని పెంచేస్తోంది. బ్రెజిల్, మెక్సికోలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ను సరిగ్గా అమలు చేయకపోవడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఇప్పటిదాకా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30వేల మందికిపైగా మరణించారు. చిలీ, పెరూ, ఈక్వెడార్‌లో కరోనా రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. ఇక చైనాలో శనివారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ముందస్తుగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసిన జర్మనీలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చర్చిలు, రెస్టారెంట్లు ప్రారంభించాక వైరస్‌ వ్యాప్తి పెరిగింది. ఎన్నో రకాలుగా భౌతిక దూరం నిబంధనల్ని అమలు చేసినప్పటికీ  ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top