హీరోయిన్‌ ఫోటో షేర్‌ చేసి బుక్కయింది..

Iran Arrests Instagram Star For Posting Angelina Jolie Lookalike Photos - Sakshi

టెహ్రాన్ : ఈ మధ్య ఫోటోలనూ మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. తాజాగా ఇరాన్‌కు చెందిన సహార్‌ తబర్‌ అనే మహిళ ఏకంగా కాస్మొటిక్‌ సర్జరీ ద్వారా హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీని పోలిన విధంగా తన ముఖాన్ని మార్చుకున్నారు. అంతేగాక ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన ఇరాన్‌ దేశంలోని టెహ్రాన్ నగరంలో చోటు చేసుకుంది.

సాంస్కృతిక, సామాజిక, నైతిక విలువలకు భంగం కలిగించిదన్న ఆరోపణలపై సహార్ తబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్‌ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేగాక తప్పుడు దారిలో ఆదాయ మార్గాన్ని ఏంచుకొన్నందుకు, హింసను ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఇరాన్‌ సైబర్‌క్రైమ్‌ ఆమె మీద కేసులు నమోదుచేసినట్లు పేర్కొంది. సహర్‌ తబర్‌ గతేడాది వరుస ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చుకున్న ముఖ చిత్రాలను వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బాగా పాపులర్‌ అయ్యారు. తాజాగా కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఆమె తన ముఖాన్ని ఎంజెలినా జోలి స్పూకీ వెర్షన్‌గా మార్చుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. కాగా, ఇరాన్‌లో ఒక్క ఇన్‌స్టాగ్రామ్ తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను నిషేదించడం విశేషం.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top