జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు | Inmates rescued to the jail guard | Sakshi
Sakshi News home page

జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు

Jul 11 2016 1:51 AM | Updated on Apr 4 2019 5:04 PM

జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు - Sakshi

జైల్లో గార్డును కాపాడిన ఖైదీలు

కాపలాగా ఉన్న గార్డు ప్రాణాన్ని రక్షించడానికి జైల్లో ఉన్న ఖైదీలు తలుపు బద్దలుకొట్టి వచ్చిన అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

హూస్టన్ : కాపలాగా ఉన్న గార్డు ప్రాణాన్ని రక్షించడానికి జైల్లో ఉన్న ఖైదీలు తలుపు బద్దలుకొట్టి వచ్చిన అరుదైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ సిటీలోని జిల్లా కోర్టుల భవనంలో ఒక జైలు గదిలో 8 మంది ఖైదీలను ఉంచారు. వారి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. అప్పటివరకు వారితో సరదాగా మాట్లాడుతూ ఉన్న గార్డు గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు.

ఖైదీలు ఎంతగా అరిచినా ఎవరూ రాకపోవడంతో వారు చేతులు కట్టివేసి ఉన్నప్పటికీ తలుపు బద్దలుకొట్టి గార్డు వద్దకు వచ్చారు. సాయం కోసం గట్టిగా కేకలు వేశారు. కోర్టులో ఉన్న అధికారులు పరిగెత్తుకొని వచ్చారు. వారు గార్డును కాపాడటాన్ని చూసి విస్మయం చెందారు. వెంటనే ఆస్పత్రికి ఫోన్‌చేసి గార్డుకు చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement